చిరంజీవి జోక్యంతో వివాదానికి ముగింపు..

చిరంజీవి జోక్యంతో వివాదానికి ముగింపు

Advertisements

<p>టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా థియేటర్ల యాజమాన్యాలు&comma; నిర్మాతల మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది&period; మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గారు&period; ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు&period; జూన్ 30 తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలను కేవలం పర్సంటేజీ పద్ధతిలోనే ప్రదర్శించాలని తాము భావిస్తున్నట్లుగా ఆయనకు తెలిపారు&period; అయితే&comma; దీనిపై స్పందించిన చిరంజీవి పరిశ్రమ హితవు కోరి ప్రస్తుతం ఫిలిం చాంబర్ కమిటీ ఇచ్చిన నివేదిక&comma; మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌కు తెలిపారు&period; చిరంజీవి ఇచ్చిన సలహాతో ఏకీభవించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు&period; తాజాగా విడుదల కాబోయే రాంచరణ్ నటించిన &OpenCurlyQuote;పెద్ది’ మూవీ ప్రదర్శనను యథావిధిగా పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే కొనసాగించేందుకు అంగీకరించారు&period; అదే సమయంలో&comma; ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పెద్ద సినిమాకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచితే&period;&period; ఆ పెంచిన మొత్తంలో 7&period;5 శాతం వాటాను ఎగ్జిబిటర్లకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది&period; ఇక మెగాస్టార్ మరోసారి పెద్దన్న పాత్ర పోషించి ఈ వివాదాన్ని పరిష్కరించడం పట్ల అటు నిర్మాతలు&comma; ఇటు ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..