కవిత కేసులో ముగిసిన తొలి రోజు ఈడీ విచారణ…

First day of ED investigation in Kavitha case...

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలి రోజు ఈడీ విచారణ ముగిసింది&period; తొలి రోజే ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు&period; విచారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు&period; ఆప్ కు ఇచ్చిన రూ&period; 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు&period; ఎవరెవరు డబ్బులు సమకూర్చారనే ఆధారాలను కూడా చూపిస్తూ ఆమెను ప్రశ్నించారు&period; ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన రూ&period; 192 కోట్ల సంగతి ఏమిటని అడిగారు&period; డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని ప్రశ్నించారు&period; ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన కవిత… మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు&period; కాగా సాయంత్రం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె భర్త అనిల్&comma; సోదరుడు కేటీఆర్&comma; బావ హరీశ్ రావు కలిశారు&period; కవిత యోగ&comma; క్షేమాలను వీరు కనుక్కున్నారు&period; ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు&period; ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు&period; ప్రతిరోజు కవితను కుటుంబ సభ్యులు&comma; ఆమె న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది&period; కుటుంబ భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.