ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో కార్తీక సోమవారం శ్రీ త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. రాత్రి నేత్రపర్వంగా జ్వాలాతోరణం జరిగింది. ఈ సందర్భంగా స్వామికి అఖండపూజ నిర్వహించారు. కోటయ్య స్వామికి విశేష అలంకారం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు. తెల్లవారు జామునుంచే వేలాదిగా భక్తులు కొండకు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున భక్తులు దీపారాధనలు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు స్వామిని దర్శించుకొని జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు కోటి దీపోత్సవం చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కోటప్పకొండ లో జ్వాలా తోరణం..
100
previous post