తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) శనివారం ఉదయం 12.10 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది. దేశ నలమూలాలు నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానంమాచరించడానికి తిరుచానూరుకు తరలివస్తారు. దీనికోసం తిరుచానూరు సర్పంచ్ కె.రామచంద్ర రెడ్డి సుమారు 9 సంవత్సరాల నుండి ప్రతి యేటా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రాత్రి 7000 మందికి అల్పాహారము, ఉదయం 10,000 మందికి అల్పాహారము, మధ్యాహ్నం భారీగా 25 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు
పద్మావతి బ్రహ్మోత్సవాల్లో అన్నదాన పంపిణీ..
77
previous post