మాజీ మంత్రి పుల్లారావు(Prattipati Pullarao)కుమారుడి అక్రమ అరెస్ట్…
ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయి. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇందులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prattipati Pullarao) గారి కుమారుడు శరత్ అక్రమ అరెస్టు. శరత్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం…వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
Andhra Pradesh State Directorate of Revenue Intelligence ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. APSDRI ఎందుకు ఏర్పడింది…దాని అసలు లక్ష్యాలేమిటి.? మూడేళ్లుగా వాళ్ళు పెట్టిన కేసులెన్ని? ఎవరెవరిపై కేసులు పెట్టారు అనే వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా? టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు APSDRI ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోంది. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు. APSDRI బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు మూల్యం చెల్లించకతప్పదు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి