Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshVijayanagaram దెందేరు గ్రామ వాలంటీర్ కనుసన్నల్లో అక్రమ మట్టి దందా

దెందేరు గ్రామ వాలంటీర్ కనుసన్నల్లో అక్రమ మట్టి దందా

by Prakash
Mud mafia in Vizianagaram

బరితెగిస్తున్న మట్టి మాఫియా(mud mafia)!

విజయనగరం జిల్లా(Vizianagaram), కొత్తవలస మండలం దెందేరు గ్రామంలో అక్రమ మట్టి మాఫియా బరితెగిస్తుంది.. చెరువులో మట్టిని త్రవ్వి గ్రామంలో గెడ్డను పూడ్చే ప్రయత్నం. సమాచారం తెలిసి కూడా చేతులెత్తేసిన రెవెన్యూ శాఖ. కన్ను పడితే చాలు చెరువులను గుల్ల చేస్తున్నారు..

అధికార పార్టీ నాయకుల అండదండలతో స్వయానా దెందేరు గ్రామ వాలంటరీగా పనిచేస్తున్న మల్లువలస శివ ఆధ్వర్యంలో అర్ధరాత్రి గ్రామంలో గల
గొల్లి చెరువులో జెసిబి మరియు ట్రాక్టర్ల సహాయముతో మట్టిని అక్రమంగా తరలించి గ్రామంలో గల దొరవ గెడ్డను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు..

గత మూడు రోజుల నుంచి గ్రామంలో ఈ తంతు జరుగుతున్నా గ్రామ రెవెన్యూ కార్యాలయం కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయింది..

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇప్పటికే సుమారుగా 1000 కి పైగా ట్రాక్టర్ల మట్టిని తరలించి.. దొరవ గెడ్డను పూర్తిగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.. అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో గ్రామ వాలంటీర్ మట్టి దందాకు అడ్డే లేకుండా పోయింది.. చివరకు మట్టి తవ్వకాలు జరుగుతున్న చోటికి మీడియా ప్రతినిధులు వెళ్లినా సరే తమకేమీ కాదన్నట్టుగా వారి పని వారు కానిచ్చేస్తున్నారు.. సంక్షేమానికి మరియు ప్రజలకు వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లే ఇలా అక్రమ మట్టి దందాను నిర్వహించడం కంచే చేనుమేస్తున్న వైనంగా ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …
హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: