కేరళ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి మృతి

Advertisements

&NewLine;<p>కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ‌లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతిచెందగా మరో 64 మంది గాయపడ్డారు&period; యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన టెక్ ఫెస్ట్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది&period; ఈ కార్యక్రమానికి పాసులున్న వారినే అనుమతించారు&period; అయితే&comma; అకస్మాత్తుగా వర్షం మొదలవడంతో వేదిక బయటున్న వారు లోపలికి రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు&period; మృతుల్లో ఇద్దరు యువకులు&comma; ఇద్దరు యువతులు ఉన్నారు&period; గాయపడిన వారికి కాలామస్సేరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు&period;<br>ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో వివిధ శాఖల మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది&period; ఘటనపై మంత్రివర్గం విచారం వ్యక్తంచేసింది&period; బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.