భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

భూగర్భ సంపద దోపిడీ... ప్రభుత్వ ఖజానాకు భారీ గండి!

Advertisements

<p>భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా&period;&period;&quest; ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా&period;&period;&quest; భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి&period; అనుమతులు లేకుండానే తెల్లరాయిని తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి&period; పాల్వంచ మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమ వ్యవహారంపై సీవీఆర్‌ న్యూస్‌ ప్రత్యేక కథనం&period;<&sol;p>&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని బిక్కుతండా గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెం శివారులో విలువైన వైట్ క్వార్జ్ నిక్షేపాలు ఉన్నాయి&period; అయితే మైనింగ్&comma; రెవెన్యూ శాఖల అనుమతులు తీసుకుని క్వారీ నిర్వహించాల్సి ఉండగా&comma; కొందరు అక్రమార్కులు జేసీబీలతో తవ్వకాలు చేపట్టి తెల్లరాయిని లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>వైట్ క్వార్జ్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది&period; గాజు తయారీతో పాటు కంప్యూటర్ చిప్స్&comma; పారిశ్రామిక పౌడర్లు&comma; పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ఈ ఖనిజాన్ని వినియోగిస్తారు&period; నాణ్యతను బట్టి దీనికి మంచి à°§à°° లభిస్తుండటంతో అక్రమ వ్యాపారులు దీన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు&period; నిబంధనల ప్రకారం తెల్లరాయిని ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే ప్రతి టన్నుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి&period; అయితే ఇక్కడ అలాంటి ప్రక్రియ ఏదీ కనిపించడం లేదని సమాచారం&period; దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి&period; మరోవైపు పగలు&comma; రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది&period; అక్రమ తవ్వకాల వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ వ్యవహారంపై పాల్వంచ తాసిల్దార్ వరప్రసాద్‌ను వివరణ కోరగా&&num;8230&semi; తెల్లరాయి తవ్వకాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు&period; మైనింగ్ లేదా రెవెన్యూ శాఖల అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు నిర్వహించరాదని&comma; అనుమతులు లేకుండా క్వారీ నిర్వహిస్తున్నట్లు తేలాల్సి ఉందన్నారు&period; విలువైన ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు&period;&period;&quest; ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారా&period;&period;&quest; అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తారా&period;&period;&quest; అనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.