57
తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గెజిట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు… సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి అందించారు. దీంతో పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువు తీరనుంది. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజ్ భవన్ చేరుకొని ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు. మరో వైపు కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల కోసం కొత్త కాన్వాయ్‌లను సిద్ధం చేశారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని దిల్ కుష అతిథి గృహానికి తీసుకు వచ్చారు.