దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్…

General Election Schedule

Advertisements

&NewLine;<p>కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది&period; ఈ నేపథ్యంలో&comma; ఏపీలోనూ ఎన్నికల కోడ్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది&period; దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు&period; కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనలతో కూడిన హోర్డింగులు&comma; కటౌట్లు&comma; పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు&period; ముఖేశ్ కుమార్ మీనాఅదనపు సీఈవోలు&comma; జిల్లా ఎన్నికల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు&period; పొలిటికల్ హోర్డింగులు&comma; కటౌట్లు తొలగించాలని ఆదేశించారు&period; ముఖ్యంగా&comma; రాష్ట్ర సెక్రటేరియట్ పరిసరాల్లోనూ&comma; ప్రభుత్వ కార్యాలయాలు&comma; పబ్లిక్ ప్లేసుల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు&period; సీ విజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ముఖేశ్ కుమార్ మీనా అధికారులకు సూచించారు&period; కోడ్ అమలు రీత్యా తనిఖీలు ముమ్మరం చేయాలని&comma; క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..