సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంరోని చైతన్య నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్ధానిక భయాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ హోటల్ లో దోశలు వేసి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారంలో కాటా శ్రీనివాస్ గౌడ్ దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పధకాలను అమలు చేసేందుకు ప్రజలు తమకు అవకాశం కల్పించాలని కోరారు.. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు..
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గౌడ్..
89
previous post