Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana అమిత్ షా పర్యటనలో మార్పు.. 18న రాక

అమిత్ షా పర్యటనలో మార్పు.. 18న రాక

by Satya
Amit Shah

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 18కి వాయిదా పడింది.

Advertisements

You may also like

Our Visitor

036160
Total views : 181155

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.