శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు(Shivratri Brahmotsavam)
శ్రీశైల మహాక్షేత్రంలో(Srisailam temple) బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలి వస్తారన్న అంచనాతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. బ్రహోత్సవాల సందర్భంగా స్వామి వారి ప్రసాదం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో దేవస్థానం సుమారు 35 లక్షల లడ్డులను అందుబాటులో సిద్ధం చేస్తున్నట్లు ఆలయం అధికారులు తెలిపారు. మల్లన్న భక్తులందరికి అడిగినన్ని లడ్డూ ప్రసాదాలు ఇచ్చేందుకు అధికారులు రోజు వారీగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
లడ్డు తయారీ కోసం దేవస్థానం సిబ్బందినే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లడ్డు తయారీకి సుమారు 200 మంది సిబ్బందిని పిలిపించి,రోజుకు సుమారు 3 లక్షల లడ్డూలు చొప్పున తయారు చేయిస్తున్నారు.ప్రస్తుతానికి సుమారు 24 లక్షల లడ్డులను సిద్ధం చేయగా. అందులో 15 లక్షల లడ్డులు ఇప్పటికే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు భక్తులు కొనుగోలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం 35 లక్షల లడ్డూలు తయారు చేయాలని నిర్ణయించారు. అలాగే లడ్డు విక్రయ కేంద్రాలు మొత్తం 20 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు ఏర్పాటు చేసి రద్దీని బట్టి క్షేత్రంలో పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని అలానే ప్రత్యేకంగా 3 కౌంటర్లు మహిళలు,దివ్యాంగులకు అందుబాటులో ఉంచమన్నారు ఆలయ ఈవో పెద్దిరాజు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి