93
భాగ్యనగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ సందడిగా మారాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అబిడ్స్ లోని సెంటినరీ మెథడిస్ట్ చర్చిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్‌లు, క్రైస్తవ మతపెద్దలు, బిషప్లు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. రంగురంగుల దీపాలతో చర్చిలను అలంకరించారు. నూతన వస్త్రాల ధరించి పెద్దలు, చిన్నారులు చర్చిలకు వచ్చారు. ప్రభువు ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షించిన కవిత ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని కొనియాడారు.
Read Also..
Read Also..