విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ లు తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు జనసేన పార్టీ చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన రాష్ట్ర పార్టీ ల ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిని ప్రజలు పడుతున్న దుస్థితిని ఎండగడుతూ నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు, నున్న గ్రామం నుంచి సూరంపల్లి వెళ్లే రహదారి దుస్థితిని వివరిస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి వైసిపి ప్రభుత్వం అరాచక పాలన గురించి విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు గుజ్జర్లపూడి బాబురావు, విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం అధ్యక్షులు కొల్లా ఆనంద్, గొడ్డళ్ళా చిన్నారావు, జనసేన జిల్లా కార్యదర్శి పొదిలి దుర్గారావు నియోజవర్గ జనసేన మహిళ నాయకురాలు మేకల స్వాతి, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది..?
74