Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Telangana జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

by Satya
JP Nadda

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. జమ్మూ కశ్మీర్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహార్‌లో లాలు కుటుంబం, ఏపీలో వైఎఎస్సార్, ఆ తర్వాత జగన్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని జేపీ నడ్డా ఆరోపించారు.

Advertisements

You may also like

Our Visitor

042283
Total views : 223753

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: