ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డును కేంద్ర కార్మిక శాఖ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారయణ సందర్శించారు. మిర్చి యార్డులోని కార్మికులను పరామర్శించి వారి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులుగా వారికి రావలసిన మౌలిక వసతులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో మిర్చి యార్డు బోర్డు నభ్యులు, అధికారులు… కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం కానీ, మహిళా కార్మికులకు బాత్రూం సౌకర్యాలు కానీ లేకపోవడం పట్ల మండిపడ్డారు. కార్మికులను మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో వివాదాలు పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యల పట్ల తక్షణమే స్పందించి వారికి తగు సదుపాయాలు కల్పించాలి అని అన్నారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున ఆందోళన చేపడుతామని జయ ప్రకాష్ నారాయణ హెచ్చరించారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గుంటూరు మిర్చి యార్డు
173
previous post