80
కూకట్ పల్లి.. వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ “గుప్పెడు బియ్యం” అనే కార్యక్రమం ద్వారా అనాధాశ్రమాలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిఎన్ఎం హైస్కూల్లో ప్రతి సంవత్సరం పిల్లలు ప్రతిరోజు గుప్పెడు బియ్యం తీసుకొచ్చి పేదలకు, అనాధలకు దానం చేయడం అనేది ఈ స్కూల్ యొక్క ఆనవాయితీ, ఆనవాయితీలో భాగంగా ప్రతిరోజు జమ చేసిన బియ్యాన్ని ప్రతి సంవత్సరం 60 నుండి 70 క్వింటాళ్ల వరకు దానం చేస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొని అనాధాశ్రమాలకు పంపిణీ చేశారు.
ఇలాంటి మంచి గుణాన్ని అలవర్చుకోవడం, పిల్లలకు నేర్పించడం గొప్ప సంస్కారం అని బండారు దత్తాత్రేయ అన్నారు.