విశాఖ, ఆర్కే బీచ్ (Vizag RK Beach)
ఆర్కే బీచ్ , అప్పికొండ బీచ్ లలో మునిగిపోతున్న యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు. ఆర్కే బీచ్ , జోన్ -6 అప్పికొండ బీచ్ లలో సోమవారం హోలీ(Holi) సందర్భంగా స్నానానికి సముద్రంలో దిగి మునిగిపోతున్న నలుగురు యువకులను గమనించి జీవీఎంసీ లైఫ్ గార్డులు వారిని రక్షించి ప్రాణాలు కాపాడడం జరిగింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వే న్యూ కాలనీకి చెందిన కౌశిక్ 20 , బషీర్ 19 , తుంగ్లాం ప్రాంతానికి చెందిన సన్నీ కుమార్ 17, గోల్ కుమార్ 23 వయస్సు గల కాలేజీ విద్యార్థులు హోలీ వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ పాండురంగాపురం, అప్పికొండ బీచ్ సమీపంలో ఆటవిడుపుగా స్నానాలకు బీచ్ లోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్న వారిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకు చేర్చారని, వీరిలో ఒకరికి సి పి ఆర్ జరిపి వెంటనే 108 లో కేజీహెచ్ కు తరలించారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి