Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Devotional తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ..

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ..

by Prakash
Garuda seva

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ(Garuda Seva)..

తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సోమవారం నాడు పౌర్ణమిని పురస్కరించుకొని గరుడసేవ వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామి వారు గరుడ వాహనంను అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తొంది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు.

గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర …
భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక …
రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..
కేంద్ర ప్రభుత్వం ముద్రించిన దివ్యభారత్ పుస్తకంలో చోటు దక్కించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జగిత్యాల జిల్లా …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019306
Total views : 90285

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.