Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Devotional నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత..

నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత..

by CVR NEWS
నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత

ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌ మరమ్మతు పనులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేస్తున్నట్టు ప్రకటించారు ఆలయ అధికారులు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భక్తుల కోసం కనకదుర్గ నగర్‌ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఘాట్‌ రోడ్‌ మూసివేత దృష్ట్యా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఆలయ ఈవో. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రోటోకాల్‌ ఆఫీస్‌ను వెంటనే కొండ దిగువన కనకదుర్గ నగర్‌లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు. కొత్త ప్రోటోకాల్‌ ఆఫీస్‌ వద్ద భక్తుల రవాణా కోసం ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో తగినన్ని బ్యాటరీ వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ఘాట్‌ రోడ్‌లో ఉన్న టికెట్‌ కౌంటర్‌ సిబ్బందిని కొత్త ప్రోటోకాల్‌ ఆఫీస్‌ వద్దకు మార్చారు. కొత్త ప్రోటోకాల్‌ ఆఫీస్‌ నుండి మహా మండపం వరకు అదనపు సెక్యూరిటీ గార్డులను, సూపర్‌వైజర్లకు విధులు కేటాయించారు. ప్రోటోకాల్‌ పరిధిలోకి వచ్చే భక్తుల దర్శనాల కోసం మహా మండపం వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేశారు. నిత్య పూజలు, సేవల కొరకు కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఘాట్‌ రోడ్‌ మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ పరిసరాల్లో మైక్‌ ద్వారా నిరంతరం అనౌన్స్‌మెంట్స్‌ చేయనున్నారు. సీతమ్మవారి పాదాల నుంచి, కుమ్మరి పాలెం సెంటర్‌ నుంచి, పున్నమి ఘాట్‌ నుంచి నిరంతరం దేవస్థానం బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: