Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Devotional తిరుపతిలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీల నిరసన…

తిరుపతిలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీల నిరసన…

by CVR NEWS
తిరుపతిలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీల నిరసన

తిరుప‌తిలో సాధుప‌రిష‌త్ ఆధ్వర్యంలో స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు నిర‌స‌న కార్యక్రమం చేప‌ట్టారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుమలపై కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ స్వామీజీలు అలిపిరి వేదికగా మండిపడ్డారు. తిరుమల పవిత్రతను, తిరుపతి ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ నిరంతరం వివాదాలు సృష్టిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం కోట్లమంది ప్రజ‌లు విశ్వసించే వెంక‌టేశ్వర స్వామి జోలికి రావొద్దని హెచ్చరించారు.

అంతే కాకుండా క‌రుణాక‌ర్ రెడ్డి ఇంటిని సైతం ముట్టడించేందుకు స్వామీజీలు ప్రయ‌త్నించారు. వారిని శిల్పారామం వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు. క‌రుణాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల‌తో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతిన్నాయ‌ని అన్నారు. క‌రుణాక‌ర్ రెడ్డి బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పాలంటూ ఏపీ సాధు ప‌రిష‌త్ అధ్యక్షుడు శ్రీనివాసానంద డిమాండ్ చేశారు. వైసీపీ హ‌యాంలో ల‌డ్డూ క‌ల్తీపై ఇత‌ర స‌మ‌స్యల‌పై నోరు మెద‌ప‌ని క‌రుణాక‌ర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని నిల‌దీశారు. అలిపిరి ప‌రిస‌రాల్లో ఎప్పుడో ద‌శాబ్దాల క్రితం అసంపూర్తిగా వ‌దిలేసిన శ‌నీశ్వరుడి విగ్రహాన్ని మ‌హా విష్ణువు విగ్రహంగా చిత్రీక‌రించి భ‌క్తుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018659
Total views : 89112

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.