Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Devotional రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..

రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..

by CVR NEWS
రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం

కేంద్ర ప్రభుత్వం ముద్రించిన దివ్యభారత్ పుస్తకంలో చోటు దక్కించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం… ప్రతి రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఏటా రూ.25 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది .బ్యాంకుల్లో రూ.50 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. స్వామివారి పేరిట బంగారం, వెండి నిల్వలు కూడా భారీగా ఉన్నప్పటికీ భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆలయంలో భక్తులు బస చేసేందుకు కనీస స్థాయిలో కూడా గదులు అందుబాటులో లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది చెట్ల కింద, మరికొందరు తాత్కాలిక షెడ్లలో రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. పాత గదులు శిథిలావస్థకు చేరగా, కొన్ని గదులను ప్రైవేట్ వ్యక్తులు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా శాశ్వత వసతి ఏర్పాట్లపై పాలకులు దృష్టి పెట్టకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
()
కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధిపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న 96 గదులు త్వరగా పూర్తి చేస్తే భక్తులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పాత కోనేరు పైభాగంలో నిర్మించిన డార్మిటరీ భవనాలను ప్రసాదం తయారీ, అన్నదానం కోసం వినియోగిస్తున్నారు. దీంతో భక్తులకు బస కోసం సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఉన్న ఫారెస్ట్ భూమిని ప్రభుత్వ సమన్వయంతో ఆలయానికి కేటాయించి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 200 ఎకరాల భూమి ఆలయానికి అందితే భక్తులకు శాశ్వత వసతి గదులు, పార్కింగ్, అన్నదాన భవనాలు, విశ్రాంతి కేంద్రాలు నిర్మించవచ్చని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది తాత్కాలిక చలువ పందిళ్ల కోసం ఖర్చు చేసే నిధులతో శాశ్వత రేకుల షెడ్లు నిర్మిస్తే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. కోట్ల ఆదాయం ఉన్న అంజన్న క్షేత్రంలో భక్తులకు కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: