ఖైదీలను విడిచిపెట్టాలని హమాస్ డిమాండ్

Hamas demands

Advertisements

&NewLine;<p>తమ డిమాండ్లను నెరవేర్చకుంటే బందీలలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేరని ఇజ్రాయెల్‌కు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ హెచ్చరిక జారీ చేసింది&period; బందీల-ఖైదీల మార్పిడి లేకుండా&comma; చర్చలు చేపట్టకుండానే ఇజ్రాయెల్ జైళ్లలోని తమ ఖైదీలను ప్రాణాలతో విడిచిపెట్టాలని హమాస్ డిమాండ్ చేసింది&period; తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబూ ఒబెయిడా హెచ్చరించాడు&period; ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు&period; ఇజ్రాయెల్‌ బలగాలతో తమ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఒబెయిడా పేర్కొన్నాడు&period; అనాగరిక ఆక్రమణదారుడితో పోరాడడం తప్ప తమకు మరో మార్గం లేదని చెప్పాడు&period; తమ నుంచి ప్రతిఘటన లేకుండా చేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా నిర్దేశించుకుందని&comma; కానీ తాము మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పాడు&period; ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల కోసం హమాస్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది&period; కాగా యుద్ధానికి విరామం ఇస్తూ వారంపాటు కొనసాగిన సంధి కాలంలో 240 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది&period; ప్రతిగా 80 మంది ఇజ్రాయెల్‌&comma; 105 మంది విదేశీ బందీలను హమాస్ విడుదల చేసింది&period; అయితే డిసెంబర్ 1à°¨ ఈ సంధి ముగిసింది&period; ఇంకా 137 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ ఈ శనివారమే ప్రకటించింది&period; మరో సంధి కోసం ప్రయత్నిస్తున్నట్టు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్ ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు&period; మరికొందరు బందీల విడుదల కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని&comma; అయితే ఇజ్రాయెల్ బాంబు దాడులతో సంధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు&period; కాగా అక్టోబరు 7à°¨ ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల నరమేధం ఈ యుద్ధకాండ మొదలైంది&period; ఇరువైపులా కలుపుకొని ఇప్పటివరకు కనీసం 17&comma;700 మంది మరణించి ఉంటారని అంచనాగా ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..