101
నాగార్జున సాగర్ ఘటన పై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున తానేమి వ్యాఖ్యానించబోనని తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ స్పందిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పుడు సాగర్ ఘటనపై వ్యాఖ్యానించినట్లయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారమవుతామని, అది తమకు ఇష్టం లేదన్నారు. ఇక ఓటింగ్ సరళి పార్టీకి అనుకూలంగా ఉందని, పట్టణ ప్రాంతంలో మరింత ఓటింగ్ శాతం పెరగాలని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఓటర్లు తనపట్ల సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.