కోటి తలంబ్రాల పంట కోత….

Farmers dressed as monkeys harvested the Talambara crop

Advertisements

&NewLine;<p>రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట&period; ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది&period; వానరుల వేషధారణతో రైతులు తలంబ్రాల పంటను కోత కోశారు&period; తలంబ్రాలకు అవసరమైన పంటను వానర్లే స్వయంగా పండించుకుని కోతలు కోయడం చూపరులను ఆకట్టుకుంటుంది&period; గోటితో ఒలిచే కోటి తలంబ్రాల పంటకు పంచామృతాభిషేకం జరిగింది&period; గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో శ్రీరామ భక్తులు వానర వేషధారణలతో రాముని పంట కోత కోశారు&period; తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తన తల్లి పొలంలో 13 ఏళ్లుగా ఈ పంట పండిస్తున్నారు&period; భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తుల ఆలయంలో పూజించి తీసుకువచ్చిన ధాన్యాన్ని వరి నారువేసి&comma; నాట్లు వేసి&comma; పంట పండిస్తున్నారు&period; ఈ పంటపై వచ్చిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రామ భక్తులకు పంపించి గోటితో ఒలిచి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు&period; ఈ తలంబ్రాలను భద్రాచలం&comma; ఒంటిమిట్ట రామాలయాలకు శ్రీరామనవమి పర్వదినం రోజున కోటి తలంబ్రాల కోసం పంపించడమే కాకుండా అయోధ్య రామునికి సైతం పంపించి అక్కడ కళ్యాణం నిర్వహిస్తారు&period; ఈ సందర్భంగా వానర వేషధారణలో పంట కోత కోయడం నిర్వహించారు&period; వరి కంకులకు పంచామృతాభిషేకం నిర్వహించి&comma; పొలంలో ఉన్న రాముని ఆలయం వద్ద మహిళలతో శ్రీరామ రక్షా స్తోత్రం&comma; హనుమాన్చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు&period; వానర వేషధారణలతో ఉన్న రైతులు &comma; కూలీలు రాముని పంట కోత కోశారు&period; ఆధ్యాత్మిక చింతనతో కొనసాగిన కోటి తలంబ్రాల పంట కోత అందరిని ఆకట్టుకుంది&period; ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ కోటి గోటి తలంబ్రాల కోసం పండించిన ఈ ధాన్యాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 800 కేజీల ధాన్యాన్ని రామభక్తులతో గోటితో ఒలిపించి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు&period; భద్రాచలం ఒంటిమిట్ట రామాలయాలే కాకుండా అయోధ్య రామలయానికి లోక కళ్యాణం కోసం తీసుకువెళ్లి స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు&period; ఈకార్యక్రమంలో మహిళలు&comma; రైతులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్