బాదంపప్పులు పోషకాలతో నిండిన గింజలు, వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బాదంపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, రక్తపోటును నియంత్రిస్తాయి, షుగర్ నియంత్రణకు కూడా సహాయపడతాయి, బరువు తగ్గించడానికి దోహదపడతాయి. అంతేకాకుండా, బాదంపప్పులు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి, రక్తహీనతను నివారిస్తాయి, చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బాదాం(Almonds) తో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది(heart diseases) – బాదంపప్పుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడుగు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతాయి. ఇది గుండె జబ్బులను తగ్గించడానికి సహాయపడుతుంది.
రక్తపోటు నియంత్రణ(Blood pressure) – బాదంపప్పుల్లో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించటానికి సహాయపడతాయి.
షుగర్ నియంత్రణ(Sugar control) – బాదంపప్పుల్లోని ఫైబర్ మరియు మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
బరువు తగ్గించడం(Weight Loss) – బరువు తగ్గాలి అనుకునే వారికి బాదాం చాల బెస్ట్ ఆప్షన్, బాదంపప్పులు ప్రోటీన్ మరియు ఫైబర్‌తో నిండి ఉంటాయి, ఇవి కడుపు నిండుగా ఉంచడానికి మరియు అధిక బరువు తగ్గించడానికి సహాయపడతాయి.
ఇవి కేవలం నాలుగు ఉదాహరణలు మాత్రమే, బాదంపప్పులు అందించే ఆరోగ్య ప్రయోజనాల లిస్ట్. ఇంకా చాల ఉపయోగాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో బాదంపప్పులను చేర్చుకోవడం ద్వారా మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
బాదాం లను రాత్రి నానపెట్టి ఉదయాన్నే తొక్కు తీసేసి తింటే మంచి ఫలితాలు పొందవచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి