సాధారణంగా చాలా మంది చికెన్, మటన్ లేదా చేపలు వంటి ఆహారాలను ఇష్టంగా తింటారు. రొయ్యలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రొయ్యలలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకంగా ఉంటాయి. ముఖ్యంగా మనలో చాలా మందికి విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంటుంది. అలాంటి వారు వారంలో రెండు సార్లు రొయ్యలను తినాలి. దీంతో ఈ లోపం నుంచి బయట పడవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు మనకు రొయ్యల వల్ల కలుగుతాయి. రొయ్యలు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. రొయ్యల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. రొయ్యలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది. మతిమరుపు సులభంగా పోతుంది. రొయ్యలు తినటం వలన శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. రొయ్యల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటిని తినటం వలన చర్మం నిగనిగలాడిపోతుంది. కాంతివంతంగా మారుతుంది. రొయ్యల్లో విటమిన్ బీ12 ఉంటుంది. దీని వలన రక్తనాళాలు శుభ్రపడతాయి. బరువు తగ్గాలి అనుకునేవారు రొయ్యల్ని తరుచూ తినటం వలన మంచి ఫలితం ఉంటుంది. రొయ్యల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో కండరాలు బలపడతాయి. రొయ్యల్లో ఉండే జింక్ మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య కణాల సంఖ్యను పెంచటానికి రొయ్యలు సహాయ పడతాయి.
రొయ్యలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
146
previous post