హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం

Advertisements

<p>ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు&period; ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం&comma; రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు&period; అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్&period; మే నెలలో వరుసగా 31 రోజులు 21 కిలోమీటర్ల రన్ పూర్తి చేసిన ఆయనను చెంగిచెర్ల శాంతివనం రన్నర్స్&comma; ఎల్బీనగర్ రన్నర్స్ ఘనంగా సన్మానించారు&period; ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు&period; ప్రతిరోజూ కనీసం అరగంటపాటు రన్నింగ్ లేదా వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు&period; 2012లో రన్నింగ్ ప్రారంభించిన తాను&comma; 2021లో ఎయిర్‌టెల్ మారథాన్‌లో పాల్గొని మారథాన్ ప్రయాణాన్ని మరింత విస్తరించానని తెలిపారు&period;తన విజయాన్ని చూసి మరికొందరు కూడా రన్నింగ్ వైపు ఆకర్షితులై ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు&period; అయితే ఇలాంటి రన్‌లలో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని&comma; తమకు సాధ్యమైన మేరకు మాత్రమే పాల్గొనాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.