ఇప్పుడు దాదాపుగా అందరూ అత్తెసరుతో అన్నం వండుతున్నారు. కానీ ఒకప్పుడు ఇళ్లల్లో గంజి వార్చి అన్నం వండేవారు. గంజిని ఒంపేశాక. పల్లెటూళ్లలో చాలా మంది ఉదయం భోజనంతోపాటే తినేవారు. ఇప్పటికీ చాలా మంది గంజిని ఆహారంగా ఉపయోగిస్తారు. గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అవేంటో చూద్దాం. శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేస్తుంది. గంజి శరీరాన్ని, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. స్నానం చేసే ముందు నీటిలో కాసింత గంజిని కలిపి దాంతో స్నానం చేస్తే సరి. మీరు మరింత ఉత్సాహంగా మారతారు. గంజిలో బోలెడన్ని విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కడుపులో మంట రావడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కొన్ని రకాల జబ్బులు రాకుండా గంజి తోడ్పడుతుంది. శక్తినిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మరింత శక్తినిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి. గంజిలో పోషకాలు విరివిగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు శరీరం పోషకాలను కోల్పోతుంది. అలాంటప్పుడు గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. డయేరియాను తగ్గించడమే కాదు ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గంజి ఎంతగానో ఉపకరిస్తుంది. డయేరియా బాధిస్తుంటే. తరచుగా గంజి తీసుకోవడం ఉత్తమం. జిమ్‌కెళ్లి తెగ శ్రమిస్తుంటారు. కండలు పెరగడానికి శరీరంలోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి. గంజిలో ఇవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇక నుంచి గంజి తాగి రోజూ ఎక్సర్సైజ్ చేయండి. కండలు పెరగడం ఖాయం. ఆరోగ్యవంతమైన జుట్టు గంజితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఒకప్పుడు గంజిని షాంపుగా, హెయిర్ కండీషనర్‌గా వాడేవారు. గంజిని ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గంజిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. పొల్యూషన్, జీవనశైలి, ఒత్తిడి కారణంగా చాలా మందికి చిన్న వయసులోనే జట్టు ఊడిపోతుంది. గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. లావెండర్ ఆయిల్‌ని కొద్దిగా గంజిలో కలిపి జుట్టుకు పట్టించి పది నిమిషాలు ఆగాక కడిగేస్తే హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడటంతోపాటు చక్కటి సువాసన వస్తుంది. గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఇంకేం జ్వరం వచ్చినప్పుడు గంజి తాగేయడం మరువకండి. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడంలో గంజి తోడ్పడుతుంది. దీన్ని కాటన్ బాల్‌తో రుద్దడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ముఖంపై గుంతలు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
గంజితో ఆరోగ్య ఉపయోగాలు
84
previous post