శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిట్ట నిలువునా చీలిపోయిందని విమర్శించారు. మేడిగడ్డ కాదు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా కూలిపోతాయని NDSA స్పష్టం చేసిందన్నారు. మొబైలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో పని ఎందుకు చేయించలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజీవ్ సాగర్, దేవాదుల, SRSP పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది వదిలేసి.. లక్ష 72 వేల కోట్లతో కాళేశ్వరం ఎందుకు కట్టారని నిలదీశారు. మనం ఇల్లు కట్టుకుంటేనే ఇంజనీరింగ్ ను పెట్టుకుంటాం… కానీ కేసీఆర్ కాళేశ్వరం నేనే కడతా అని దాన్ని ఏం చేశారో మనం ఇప్పుడు చూస్తున్నామని భట్టి విక్రమార్క విమర్శించారు.Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.