భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి పాములేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో వాగు పొంగి ములకలపల్లి ప్రధాన రహదారి అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దింతో రెండు రోజుల నుండి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దింతో తాళ్ళపాయి గ్రామస్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. వర్షాకాలం వచ్చిందంటే పాములేరు వాగు పొంగి రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ఆ ప్రాంత ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములకలపల్లి నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనులు ప్రారంభించటానికి ముందు వాహన రాకపోకలు సాగించేందుకు వీలుగా తాత్కాలిక రాహదారి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కాని కాంట్రాక్టర్ ఆరు నెలల క్రితం ప్రస్తుతం వున్న బ్రిడ్జి ను కూలగొట్టి తూతూ మంత్రంగా తాత్కాలిక అప్రోచ్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు చాల సార్లు కొట్టుకుపోగ శనివారం రాత్రి కురిసిన చిన్న పాటి వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయి రహదారి పరిధిలోని రింగు రెడ్డి పల్లి, తాళ్ళపాయ, మంగళిగుట్ట, సుందర్ నగర్ సుమారు 20 గ్రామాలకు మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనులు చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న అధికారులు కనీసం పట్టించుకోవడమేలేదని గ్రామస్థులు నిరసన చేస్తున్నారు.ఎంత మంది ఎమ్మెల్యే లు మరీనా తమ ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో ఉంటున్న ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు దారి లేక రెండు రోజులుగా పస్తులుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పదించి వంతెన పనులు వేగవంతం చేయాలనీ 20గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.