పోలీస్ శాఖకు 200 ద్విచక్ర వాహనాలను బహుకరించిన హీరో సంస్థ..

Hero Bikes

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా శ్రీ సిటీ లోని హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు 200 గ్లామర్ ద్విచక్ర వాహనాలను సీ ఎస్ ఆర్ స్కీం ఉచితంగా ఇచ్చారు&period; అందులో భాగంగా బుధవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో తిరుపతి పృథ్వి హీరో సంస్థ ఆధ్వర్యంలో 30 ద్విచక్ర వాహనాలను పోలీస్ శాఖ కు అందజేసే కార్యక్రమం జరిగింది&period; ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు&period; హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ ప్రతినిధులు&comma;<br>హీరో సంస్థ అధినేత పృథ్వి సంయుక్తంగా ఈ వాహనాలను ఎస్పీ సమక్షంలో జిల్లా పోలీస్ శాఖకు అప్పగించారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం 120 ద్విచక్ర వాహనాలను ఇవ్వడం జరిగిందన్నారు&period; నేడు 30 వాహనాలు అందజేశామని తెలిపారు&period; మరో విడత 50 ద్విచక్ర వాహనాలు అందివనున్నట్లు తెలిపారు&period; పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో భక్తుల భద్రత తో పాటు తిరుపతి జిల్లాలో పోలీస్ శాఖ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు&period; హీరో మోటార్ వాహనాల సంస్థ భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు&comma; తిరుపతి హీరో సంస్థ అధినేత పృథ్వి తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..