హైదరాబాద్ నగరం కూడా మరో బెంగళూరు అవుతుంది..
వేసవిలో తాగునీటి ఎద్దడి ముప్పు ముంచుకొస్తోందని.. ఇప్పటి నుంచే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ(High Court issued orders) చేసింది. జల సంరక్షణ చర్యలు చేపట్టని పక్షంలో హైదరాబాద్(Hyderabad) నగరం కూడా మరో బెంగళూరులా మారి నీటికి కటకట ఏర్పడుతుందని హెచ్చరించింది. నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన పలు చర్యలను సూచించింది. వాటి అమలుపై ఈ నెల 26లోగా నివేదిక సమర్పించాలంది.
హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల్లో నీటి కొరతపై తగిన చర్యలు..
రాష్ట్రంలో, హైదరాబాద్-సికింద్రాబాద్(Hyderabad-Secunderabad) నగరాల్లో నీటి కొరతపై తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పి.ఆర్.సుభాష్‌చంద్రన్(PR Subhashchandran) 2005లో రాసిన లేఖను అప్పట్లోనే హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించింది. దానిపై పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్(J. Anil Kumar)లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
నీటి కొరత రాకుండా తగిన చర్యలు..
గతంలో ఇదే హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లతోపాటు కోర్టు సహాయకుడిగా నియమితులైన సీనియర్ న్యాయవాది డి. ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన నివేదికను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. భవిష్యత్తులో నీటి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు నివేదించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధుల దుర్వినియోగం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి