తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..

Advertisements

<p>తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సి&period;వి&period; ఆనంద్ బాధ్యతలు స్వీకరించడం పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది&period; హైదరాబాద్‌లో జన్మించిన ఆనంద్ చిన్నప్పటి నుంచే ప్రతిభను చాటుకుని విద్యలో అగ్రగామిగా నిలిచారు&period;హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువు కున్న సి వి ఆనంద్ స్కూల్ టాపర్‌గా నిలిచారు&period; నిజాం కాలేజీ &comma; ఉస్మానియాలో ఉన్నత విద్య పూర్తి చేశారు&period; 22 ఏళ్లకే ఐపీఎస్ సాధించి సేవా ప్రస్థానాన్ని ప్రారంభించారు&period; కెరీర్ ప్రారంభ దశలో వరంగల్&comma; నిజామాబాద్ ప్రాంతాల్లో నక్సలైట్లపై సమర్థంగా పోరాడి ధైర్యసాహసాలకు గుర్తింపుగా ప్రెసిడెంట్స్ గ్యాలంట్రీ మెడల్ అందుకున్నారు&period; ప్రజల భద్రత&comma; శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత వెల లేనిది &period; క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారిగా పేరుపొందిన ఆయన&comma; కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడరు&period; అనుభవం&comma; పరిపాలనా దక్షత కలయికతో తెలంగాణ పోలీస్ శాఖను మరింత సమర్థవంతంగా నడిపిస్తారనే అందరిలో అభిప్రాయం వ్యక్తమవుతుంది &period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పనిచేసిన సమయంలో సి&period;వి&period; ఆనంద్ తీసుకున్న నిర్ణయాలు నగర ట్రాఫిక్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారి తీశాయి&period; ఈ-చలాన్ విధానం&comma; డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలను కఠినంగా అమలు చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు&period; సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నప్పుడు మహిళల భద్రత కోసం షీ టీమ్స్&comma; షీ షటిల్స్ వంటి వినూత్న కార్యక్రమాలను బలోపేతం చేశారు&period; హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో పెద్ద పండుగలను ప్రశాంతంగా నిర్వహించి పరిపాలనా సామర్థ్యాన్ని చాటుకున్నారు&period;ప్రధానంగా వినాయక చవితి&comma; బక్రీద్ వంటి పండుగలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించి మెప్పించారు&period; ఆధునిక సాంకేతికతను వినియోగించి నేర నియంత్రణలో కొత్త విధానాలను ప్రవేశపెట్టిన ఆయన&comma; పోలీసింగ్‌ను మరింత ప్రజానుకూలంగా మార్చడంలో ముందున్నారు&period;<&sol;p>&NewLine;<p>సి&period;వి&period; ఆనంద్ పరిపాలనా దక్షతతో పాటు క్రీడాస్ఫూర్తి కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు&period; రంజీ ట్రోఫీ స్థాయిలో క్రికెట్ ఆడిన ఆయన&comma; 50 ఏళ్లు దాటినా టెన్నిస్&comma; క్రికెట్‌లో చురుకుగా పాల్గొంటూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు&period; పౌర సరఫరాల శాఖలో పనిచేసినప్పుడు ఈ-పోస్ వ్యవస్థను ప్రవేశపెట్టి అవినీతి తగ్గించి ప్రభుత్వానికి భారీ ఆదా కల్పించారు&period; కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన సమయంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయ భద్రతను పర్యవేక్షించారు&period; ప్రధాన మంత్రి గ్యాలంటరీ అవార్డు&comma; రాష్ట్రపతి పోలీస్ పతకం వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు&period; క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకత్వం&comma; సాంకేతిక పరిజ్ఞాన వినియోగం&comma; క్రీడా దృక్పథం—అన్ని కలిసిన సమగ్ర వ్యక్తిత్వం ఆయనదే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..