ఐ.టీ పరిశ్రమల ఏర్పాటులో హైదరాబాద్ నగరం..

IT industries

Advertisements

&NewLine;<p>దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి టి&period; హరీష్ రావు స్పష్టం చేశారు&period; కే ఎల్ యూనివర్సిటీ బోరంపేట క్యాంపస్ లో అత్యాధునికంగా ఏర్పాటుచేసిన ఆపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఐ&period; టి&period; ఉద్యోగాలను అందించగలిగామని&comma; పారిశ్రామిక రంగంలో మరో 24 లక్షల ఉద్యోగాలను అందించామని చెప్పారు&period; పరిశ్రమల ఏర్పాట్లకు కావాల్సిన అన్ని రకాల మౌళిక వసతులు&comma; ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తద్వారా హైదరాబాద్ నగరం అనేక రంగాల్లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని చెప్పారు&period; మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉండటం గర్వించదగ్గ విషయమని అన్నారు&period; కే ఎల్ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు అమ్మాయిలు 50 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ పొందటం అభినందనీయమని అన్నారు&period; తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనేక పధకాలను అందుబాటులోకి తెచ్చామని&comma; వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని హరీష్ రావు చెప్పారు&period; కే ఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో డిసెంబర్ నెల 15 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు&comma; మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ పోస్టర్ ను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు&period; ఈ కార్యక్రమంలో కే ఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ పార్ధసారధి వర్మ&comma; బోరంపేట క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు&comma; అజీజ్ నగర్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ&comma; యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె&period; శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్