ఐలాపూర్ భూములపై 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉంది ..

Advertisements

<p>అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది&period; భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు&period; రెవెన్యూ&comma; మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది&period; ఐలాపురం తండాలో కానీ&comma; గ్రామంలోని నివాస గృహాల జోలికి కానీ వెళ్లకుండా చర్యలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు&period; కేవలం అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు&comma; ఖాళీ స్థలాల స్వాధీనంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు&period; 1998 నుంచి &&num;8216&semi;స్టేటస్ కో కొనసాగించాలని కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ&comma; వాటిని ఖాతరు చేయకుండా ముఖిమ్ నిర్మించిన గెస్ట్ హౌస్‌ను హైడ్రా నేలమట్టం చేసింది&period; అలాగే అతని సోదరుడు అజీమ్ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు తొలగిస్తున్నారు&period; ఐలాపూర్ గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది&period; ఇందులో ఇప్పటికే అనేక నివాసాలు వెలిశాయి&period; మిగిలి ఉన్న 860 ఎకరాల ఖాళీ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టింది&period; ఈ భూమి విలువ సుమారు రూ&period;15 వేల కోట్ల పైమాటే ఉందని అంచనావేస్తున్నారు&period; కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు&period; అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు&period; హైడ్రా చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ వల్ల వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..