76
లంచం కేసులో నన్ను ఇరికించాలని, నాపై తప్పుడు ఆరోపణలు చేసిన బత్తుల గోవింద్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున .. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గోవింద్ ను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా ముసుగులో కొంతమంది వ్యక్తులు నన్ను అప్రతిష్ట పాలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందువలన నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేరుగ కోరారు. మీడియా ముసుగులో ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి.. వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి మేరుగ నాగార్జున ఎస్పీని కోరారు.
Read Also…