ఈ టిప్స్ పాటిస్తే ఆన్‌లైన్ స్కామ్స్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్ సేఫ్..!

Online scams

Advertisements

&NewLine;<p>ఆన్‌లైన్ మోసాలు చాలావరకు మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి&period; దీంతో మీ డివైజ్‌ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవాలి&period; ఇటీవల కాలంలో ఆన్‌లైన్ స్కామ్స్ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి&period; జాబ్ ఆఫర్స్ &comma; గిఫ్ట్ &comma; లాటరీ పేరుతో అమాయకులను టార్గెట్ చేసుకుని లక్షల్లో దోచేస్తున్నారు మాయగాళ్లు&period; స్మార్ట్‌ఫోన్లకు లింక్ లేదా మెనేజ్ పంపుతూ జనాలను బురిడి కొట్టిస్తున్నారు&period; ఏ మాత్రం ఏమరపాటుగా ఉండి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు&period; మీ అకౌంట్లలోని సొమ్ము మీకు తెలియకుండానే మాయం అవుతుంది&period; ఆన్‌లైన్ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం&period; లేటెస్ట్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ సైబర్ స్కామర్స్ సాధారణంగా వినియోగదారుల స్మా్ర్ట్‌ఫోన్ ఓఎస్‌ను ఉపయోగించి స్కామ్‌లకు పాల్పడుతుంటారు&period; ఇవి తరుచుగా CERT-In రూపంలో మిమ్మల్ని అలర్ట్ చేసేవిగా ఉండవచ్చు&period; లేదా ఒక నిర్దిష్ట యాప్‌లో సున్నితమైన డేటాను లీక్ చేసే విధంగా ఉండొచ్చు&period; అందుకే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి&period; దీంతో స్కామ్‌à°² బారిన పడే రిస్క్ తగ్గుతుంది&period; యాప్‌లను సైతం తాజా వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి&period; అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి&period; సైబర్ కేటుగాళ్లు స్పామ్&comma; హానికరమైన లింక్‌లను ఎస్‌ఎంఎస్ రూపంలో తరచుగా పంపుతుంటారు&period; అవి లాభదాయకమైన ఆఫర్స్ రూపంలో ఉంటూ నమ్మదగినవిగా ఉంటాయి&period; లింక్‌లపై క్లిక్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు&period; ఇలాంటి సమయంలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి&period; అనుమానాస్పదంగా ఉండే లింక్‌లను అసలు ఓపెన్ చేయకండి&period; ట్రూకాలర్ వంటి యాప్‌ని ఉపయోగించడం ద్వారా స్పామ్‌ని చాలావరకు ఫిల్టర్ చేయవచ్చు&period; సిమ్ కార్డ్‌ లాక్ చేయడం సైబర్ మోసగాళ్లు ఇటీవల సిమ్ స్వాప్ ఫ్రాడ్ వంటి స్కామ్‌లకు పాల్పడుతున్నారు&period; ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి మీ వ్యక్తిగత వివరాలను సేకరించి&comma; వాటి ద్వారా నకిలీ SIM కార్డ్‌ను సృష్టిస్తున్నారు&period; ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ SIMను పాస్ వర్డ్ ద్వారా లాక్ చేయాలి&period; పాస్‌వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయకూడదు&period; పాస్‌వర్డ్ మీకు మాత్రమే తెలిసినందునా మీరు మాత్రమే మీ SIMని మరొక డివైజ్ లో యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది&period; ఒకవేళ స్కామర్ మీ డూప్లికేట్ సిమ్‌కి యాక్సెస్ పొందినప్పటికీ&comma; వారు నెట్‌వర్క్ సేవలను యాక్సెస్ చేయలేరు&period; దీంతో మీరు స్కామ్ బారిన పడటానికి అవకాశం ఉండదు&period; వీపీఎన్ యాక్సెస్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు మీ ఫోన్‌లో డేటా అయిపోయి&comma; పబ్లిక్ వైఫై ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడితే స్మార్ట్‌ఫోన్‌లో VPN యాక్సెస్ చేసుకోండి&period; ఇది స్కామ్ బారి నుంచి మీ ఫోన్‌ను రక్షిస్తుంది&period; విలువైన మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది&period; దీంతో మీ డేటా చోరి కాకుండా వీపీఎన్ కాపాడుతుంది&period; సెన్సిటివ్ డాక్యుమెంట్స్‌కు ప్రత్యేక ఫోల్డర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఆధార్&comma; బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన డిజిటల్ కాపీని ఫోన్‌లో సేవ్ చేసుకుని ఉంటారు&period; అయితే సైబర్ అటాక్ చేసే వ్యక్తి డివైజ్‌ను హ్యాక్ చేస్తే&comma; మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది&period; అందుకే ముఖ్యమైన ఫైల్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేసేలా పాస్‌వర్డ్-ప్రొటెక్డ్ సెక్యూరిటీ ఫోల్డర్‌లో వాటిని స్టోర్ చేయాలి&period; పాస్‌వర్డ్‌à°² కోసం పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించుకుంటే మీ ఫోన్‌కు మరింత సెక్యూరిటీ లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.