75
కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే వాటిని ఆమోదించి అమలు చేస్తున్నామని వివరించారు. మా ప్రభుత్వం హామీలు అమలు చేయడం వల్ల కన్నడ మహిళలు సంతోష్ంగా ఉన్నారన్నారు. మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారని చెప్పారు.