66
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పాడేరు విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ముట్టడించి, ఉద్యోగులు బయటకు రాకుండా దిగ్బంధించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రధాన గేట్లను మూసివేసి, ప్లెక్సీలు కట్టి ధర్నాకు దిగారు. భారతీయ జనతా పార్టీ నేతలు.. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజేపి ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు ఈ.పి.డి.సి.ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ చార్జీల భారంతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మరింతగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.