అంతరిక్ష రంగంలో చరిత్రను లిఖిస్తున్న భారత్‌

India

Advertisements

&NewLine;<p>దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలు అంబరాన్నంటాయి&period; పరేడ్‌ లో పలు రాష్ట్రాలు&comma; కేంద్రపాలిత ప్రాంతాలు&comma; కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి&period; అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్‌ సాధించిన చంద్రయాన్‌-3 విజయం నుంచి అయోధ్యలో ఇటీవల కొలువైన బాల రామయ్య వరకూ అనేక విశేషాలను వీటిల్లో ప్రదర్శించారు&period; భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ISRO ప్రదర్శించిన శకటంలో చంద్రయాన్‌-3&comma; ఆదిత్య ఎల్‌-1 మిషన్లు ఆకట్టుకున్నాయి&period; చంద్రుడిపై మన విక్రమ్‌ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఇందులో ప్రదర్శించారు&period; శకటంపై ఉన్న మహిళా శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ దిగిన శివశక్తి పాయింట్‌ను చూపించారు&period; ఉత్తరప్రదేశ్‌ శకటంలో రామ్‌ లల్లా చిత్రం ఆకట్టుకుంది&period; అయోధ్యలో నవనిర్మిత భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు&period; శకటానికి ముందు బాలక్‌రామ్‌ విల్లు-బాణంతో దర్శనమిచ్చారు&period; ఈ పరేడ్‌లో తెలుగు రాష్ట్రాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి&period; అమర వీరులను స్మరించుకునేలా తెలంగాణ శకటాన్ని తీర్చిదిద్దారు&period; దీనికి &OpenCurlyQuote;జయ జయహే తెలంగాణ’గా నామకరణం చేశారు&period; తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది&period; శకటంలో కుమురం భీం&comma; రాంజీ గోండు&comma; చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి&period; విద్యారంగం థీమ్‌తో ఏపీ శకటాన్ని ప్రదర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్