47
విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి రానుంది. ఫుడ్ కార్పోరేషన్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో 29 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించనున్నారు. దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రిటైల్ ఔట్ లెట్లలో ఈ బియ్యాన్ని విక్రయించనున్నారు. కాగా ఇప్పటికే భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో గోధుమపిండి, శనగపప్పు లను తక్కువ ధరలకు ప్రవేశపెట్టి విజయవంతంగా పంపిణీ చేస్తుండటంతో ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారత్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.