బిక్షాటన చేస్తూ అంగన్వాడీల వినూత్న నిరసన…

Innovative protest of Anganwadis

Advertisements

&NewLine;<p>గత తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా&comma; నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ&comma; సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ &amp&semi; హెల్పర్స్ యూనియన్&lpar;సీఐటీయూ&rpar; ఆధ్వర్యంలో ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద లింగసముద్రం&comma; ఉలవపాడు&comma; గుడ్లూరు మండలాలకు చెందిన అంగనవాడి వర్కర్లు&comma; హెల్పర్లు సుమారు 250 మంది ఈరోజు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు&period; రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు&period; అంగన్వాడీలు నిరవధిక సమ్మె తొమ్మిది రోజుల నుండి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు&period; అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్&comma; వాకా&period; లతా రెడ్డి&comma; ప్రభావతి తదితరులు మాట్లాడారు&period; సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు&period; ప్రభుత్వం అనాగరికంగా అంగన్వాడి సెంటర్ల తాళాలు పగల గొట్టటం సిగ్గుచేటు అన్నారు&period; మహిళలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వానికైనా తగిన శాస్తి జరుగుతుందన్నారు&period; ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా&comma; ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు&period; అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో అంగన్వాడి సమ్మెకు మద్దతు ఇవ్వమని అంగన్వాడీల భిక్షాటన&comma;ధర్నా&period; అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకాలాతారెడ్డి&period; ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి&comma; అన్ని మండలాల నాయకులు ఎస్ కే పద్మజ&comma; బీ మార్తమ్మ&comma;కత్తి&period; బుజ్జమ్మ&comma;మంచాలి సిహెచ్ పద్మజ&comma; ఎం పద్మ&comma; సిహెచ్ రమాదేవి&comma; కాకర్లపూడి శైలజ&comma; డి వరలక్ష్మి&comma; డి రమాదేవి&comma; సురేఖ&comma; ప్రసన్న తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.