78
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్టు రాకాడని, అయినా ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనన్నారు. తన వెంట ఉన్నది ధైర్యలక్ష్మి మాత్రమే అన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేలు ఇస్తే తీసుకోవాలని, కానీ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా శక్తి, ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అని ఈటల అన్నారు.