70
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే పార్టీలో లోకేశ్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా? తెలంగాణ తరహాలోనే ఆంధ్రాలో కూడా టీడీపీ జెండా పీకేశారా? లేక, టీడీపీ భారమంతా పురందేశ్వరిపైనే పెట్టారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావొచ్చేమో కానీ, బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో దిట్ట కాదు సుమా! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.