US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ

Advertisements

<p>అమెరికా వైమానిక విన్యాసాల్లో ప్రమాదం జరిగింది&period; US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ కొన్నాయి&period; ఇదాహోలోని ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ ఎయిర్ షోలో జరిగింది ఈ ఘటన&period; గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా అమెరికా నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి&period; అయితే&comma; అదృష్టవశాత్తూ విమానాల్లోని నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు&period; ప్రమాదం జరిగిన వెంటనే రెండు విమానాల్లోని నలుగురు సిబ్బంది పారాచూట్ల సాయంతో కిందకు దూకేశారు&period; వారి పరిస్థితి నిలకడగా ఉందని&comma; ఎయిర్‌బేస్‌లో ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు అధికారులు&period;<&sol;p>&NewLine;<p>ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period; రెండు విమానాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఢీకొనడం&comma; వెంటనే నలుగురు సిబ్బంది పారాచూట్లతో బయటకు దూకడం&comma; ఆ తర్వాత విమానాలు కిందపడి భారీ మంటల్లో కాలిపోవడం ఈ వీడియోల్లో కనిపించాయి&period; ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఎయిర్ షోను రద్దు చేసి&comma; బేస్‌ను లాక్‌డౌన్ చేశారు&period;<br &sol;>&NewLine;గాల్లో విమానాలు ఢీకొన్నప్పుడు సిబ్బంది బయటపడటం చాలా అరుదని&comma; ఇది నిజంగా అద్భుతమంటున్నారు విమానయాన భద్రతా నిపుణులు&period; రెండు విమానాలు ఢీకొన్న తర్వాత ఒకదానికొకటి అతుక్కుపోయి కిందకు పడటం వల్లే&comma; సిబ్బందికి బయటకు దూకే సమయం లభించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు&period; ఇది పైలట్ తప్పిదం వల్లే జరిగి ఉండే అవకాశముందని తెలిపారు&period; ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..