సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Advertisements

<p>సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు&period; దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెరిగింది&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం న్యాయమూర్తుల సంఖ్య పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది&period; వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు అనుగుణంగా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు&period; ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92వేల కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని&comma; ప్రజలకు వేగంగా న్యాయసేవలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు&period; తాజాగా&period;&period; రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య పెంపు అమల్లోకి వచ్చింది&period; న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో తలెత్తే అదనపు ఖర్చును భారత సంఘటిత నిధి నుంచి సమకూరుస్తారు&period; ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు&period; రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి&period; ఈ ఏడాది నవంబర్‌లోపు నలుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.