దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

Stock markets

Advertisements

<p>అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు&comma; ఇంధన à°§à°°à°² మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి&period; గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2&period;70 శాతం&comma; నిఫ్టీ 2&period;20 శాతం మేర పతనమయ్యాయి&period; శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 వేల 237 పాయింట్ల వద్ద&comma; నిఫ్టీ 23 వేల 643 వద్ద స్థిరపడ్డాయి&period; పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు&comma; అమెరికా-ఇరాన్ వివాదం&comma; రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పతనమవడంతో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు గురైంది&period; బ్రెంట్ క్రూడ్ ఆయిల్ à°§à°° అంతకంతకూ పెరుగుతుండటం మార్కెట్లలో ఆందోళన పెంచింది&period; ఐతే రెండ్రోజుల తర్వాత ఇవాళ ప్రారంభమవుతున్న మార్కెట్‌కు కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు&period; ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ 61 పాయింట్ల లాభంతో 23 వేల 769 వద్ద ట్రేడవుతుండటం మార్కెట్ పాజిటివ్‌గా ఓపెన్ అయ్యే అవకాశాలను సూచిస్తోంది&period; డాలర్‌‌తో రూపాయి విలువ 96&period;05 వద్ద ట్రేడవుతోంది&period; రూపాయి ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి&period; చమరు à°§à°°à°² పెరుగుదల&comma; విదేశీ ద్రవ్యం అధికం కావడం&comma; పశ్చిమాసియాలో అస్థిరత వంటివి రూపాయి పతనానికి కారణాలుగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..