హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ.

Advertisements

<p>అమెరికాలో పనిచేయాలనుకునే విదేశీ నిపుణులకు&comma; వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది&period; కొత్తగా జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది&period; ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది&period;<&sol;p>&NewLine;<p>నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గతేడాది సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది&period; దీనిని సవాల్ చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు&period; విచారణ జరిపిన దిగువ కోర్టు&comma; అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని&comma; ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని పేర్కొంటూ జూన్ 8à°¨ ఫీజు వసూలుపై స్టే విధించింది&period; ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ యంత్రాంగం బోస్టన్ కేంద్రంగా పనిచేసే ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ దాఖలు చేసింది&period; దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం&comma; ఈ ఫీజును విధించే అధికారం తమకు ఉందని నిరూపించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేసింది&period; దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ&comma; ప్రభుత్వ అప్పీల్‌ను తోసిపుచ్చింది&period;<&sol;p>&NewLine;<p>అమెరికన్ల ఉద్యోగాల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి హెచ్‌-1బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని&comma; దానిని నిరోధించడానికే ఈ ఫీజు విధించామని ట్రంప్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది&period; సాధారణంగా వివిధ అంశాలను బట్టి హెచ్‌-1బీ వీసా ఫీజు 2&comma;000 నుంచి 5&comma;000 డాలర్ల వరకు ఉంటుంది&period; దీనిని ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి&period; ఇప్పటికే అమెరికాలో విద్యార్థి వీసాలపై ఉండి&period;&period; హెచ్‌-1బీ వీసాలకు మారే వారికి ఈ భారీ ఫీజు వర్తించదని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.